
అమరావతి, 12 మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు రక్షణ , తయారీ రంగాల్లోనూ ఏపీని గ్లోబల్ హబ్గా మార్చాలన్న లక్ష్యంతో నెల్లూరు జిల్లాలో ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న అటానమస్ మారిటైం షిప్ యార్డుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డు కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ రంగానికి అవసరమైన అత్యాధునిక నౌకల నిర్మాణం ఇక్కడ జరగనుంది.
ఈ ప్రాజెక్టు మొదటి దశలో సుమారు రూ.45 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 750 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మానవరహిత నౌకలు , అత్యాధునిక సాంకేతికతతో కూడిన యుద్ధ నౌకల తయారీకి ఈ కేంద్రం చిరునామాగా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ