లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో తెలంగాణ గవర్నర్
యాదగిరిగుట్ట, 12 మార్చి (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గురువారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలిసారిగా యాదగిరిగుట్టకు విచ్చ
Governor


యాదగిరిగుట్ట, 12 మార్చి (హి.స.)

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని గురువారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలిసారిగా యాదగిరిగుట్టకు విచ్చేసిన గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తర్వాత గవర్నర్ దంపతులు ఆలయంలోకి ప్రవేశించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి దివ్య దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య గవర్నర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. తర్వాత ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవాని శంకర్ లు గవర్నర్ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని బహుకరించారు. అంతకు ముందు గవర్నర్కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ లు స్వాగతం పలికారు. దర్శనం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande