
హైదరాబాద్, 12 మార్చి (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాలలో మొత్తం ఆరుగురు మృతి చెందడం జరిగింది.
బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు
మహబూబాబాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన జిల్లా మరిపెడ మండలంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మరిపెడ మండలంలోని గాలివారి గూడెం గ్రామానికి చెందిన బల్లెం ఉదయ్ కిరణ్ (22), బండి భిక్షం (22) ఇద్దరూ హైదరాబాద్లో ఉంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఉదయ్ కిరణ్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుండగా, భిక్షం వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. కాగా ఉదయ్ కిరణ్ ఇంట్లో ఓ శుభకార్యం ఉండటంతో బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. రాత్రి భిక్షం కూడా హైదరాబాద్ నుంచి రాగా, ఉదయ్ కిరణ్ మహబూబాబాద్ వెళ్లి భిక్షంను ఎక్కించుకుని వస్తుండగా మరిపెడ మండలంలోని జాతీయ రహదారి 365పై లచ్యా తండా స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
మరో ప్రమాదం లో ఇద్దరు మృతి చెందిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం జరిగింది. కొత్తూరు మున్సిపాలిటీ నారాయణగూడ కాలనీ చెందిన సూరజ్ గురువారం ఇంటర్ పరీక్ష రాసేందుకు తన స్నేహితుడు బిక్కీతో కలిసి బైకుపై వెళుతున్నాడు.
ఈ క్రమంలోనే శంషాబాద్ మండల పరిధిలోని 44 నెంబర్ జాతీయ రహదారి పై మదనపల్లి వద్ద వీరిని లారీ ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి.. మరో వ్యక్తి పొట్ట పై నుంచి లారీ వెళ్ళింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా రాజాపూర్ మండల పరిధిలోని చెన్నవెల్లి గ్రామానికి చెందిన చిల్వేరి నరేష్ గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజాపూర్ నుండి షాద్నగర్ వైపు ద్విచక్ర వాహనం పై వెళ్తున్న నరేష్ను ఓ లారీ ఢీ కొంది. దీంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు