
శ్రీకాకుళం, 12 మార్చి (హి.స.)
, : లంచం డిమాండ్ చేయడం... ఇచ్చిన సొమ్ముని దొంగచాటుగా జేబులో వేసుకోవడం.. పాత పద్ధతి..! ఇప్పుడంతా డైరెక్ట్. లంచాల సొమ్మును కూడా ఆన్లైన్లోనే వసూలు చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల పాటు విస్తృత సోదాలు చేపట్టింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, విశాఖపట్నంలోని 3 జోనల్ కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో భారీగా అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల వద్ద అనధికారికంగా ఉన్న రూ.2.97 లక్షల నగదు, అలాగే కడప మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ అధికారులకు సహకరించే ముగ్గురు ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.57 వేలను స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ