భూభారతి స్కాంకు రెవెన్యూ మంత్రి బాధ్యత వహించాలి.. జనగామ ఎమ్మెల్యే
జనగామ, 12 జనవరి (హి.స.) ధరణి పోర్టల్ బ్రహ్మాండంగా నడిస్తుంటే రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తెచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జనగామ మున్సిపల్ అభివృద్ధిపై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
జనగామ ఎమ్మెల్యే


జనగామ, 12 జనవరి (హి.స.)

ధరణి పోర్టల్ బ్రహ్మాండంగా నడిస్తుంటే రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తెచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జనగామ మున్సిపల్ అభివృద్ధిపై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భూభారతిలో స్కాం వందలా..వేల కోట్లా తేల్చాల్సి ఉందన్నారు. మీడియా వల్లే ప్రభుత్వం హై పవర్ కమిటీ వేసింది. దాని వెనుక ఉన్నది ఎవరన్నది సమగ్ర విచారణ జరిపి డబ్బులను రికవరీ కవరీ చేసి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తప్పుల తడకగా ఉన్న భూ భారతిని తొలిగించి ధరణి పేరు కొనసాగించాలన్నారు. భూభారతిలో మీ సేవా నిర్వాహకులు, సంబంధిత అధికారులు కుమ్మక్కై కోట్లు కొల్లగొట్టారు. చలానాలు చెల్లించిన రైతులు, కొనుగోలుదారులకు డబ్బు రికవరీకి నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎవరైతే అక్రమాలు చేశారో వారి దగ్గర వసూలు చేసి ఖజానాకు చెల్లించాలన్నారు. భూభారతి స్కాంకు రెవెన్యూ మంత్రి బాధ్యత వహించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande