రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడింది.. మాజీ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి, 12 జనవరి (హి.స.) రాష్ట్రంలో ప్రజా పాలన పూర్తిగా కుంటుపడిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రజల మౌలిక సమస్యల పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ముఖ్యంగా మేడ్చల్ ప్రాంత ప్రజలు త
మాజీ మంత్రి మల్లారెడ్డి


మేడ్చల్ మల్కాజిగిరి, 12 జనవరి (హి.స.)

రాష్ట్రంలో ప్రజా పాలన పూర్తిగా

కుంటుపడిందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రజల మౌలిక సమస్యల పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ముఖ్యంగా మేడ్చల్ ప్రాంత ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సోమవారం మేడ్చల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై జలమండలి అధికారులను కలిసి మల్లారెడ్డి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జనవరి నెలలోనే నీటి సమస్య తలెత్తితే రాబోయే వేసవిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande