
సంగారెడ్డి, 12 జనవరి (హి.స.)
దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని దేశభక్తి, ఆత్మవిశ్వాసం, సేవాభావం పెంపొందించడంలో స్వామి వివేకానందుడి బోధనలు ఎంతో ప్రేరణనిస్తాయని సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించడం ద్వారా యువతలో చైతన్యం, బాధ్యత భావం పెంపొందించాలనే ఉద్దేశం ఉందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు