
సిద్దిపేట, 12 జనవరి (హి.స.)
మెడికల్ ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు సెలవుల పైన వెళ్ళాలి అంటే పై అధికారి అనుమతి తప్పనిసరిగా ఉండాలని, ఎవరికి వారే లీవ్ లెటర్ రాసుకుని సెలవులు తీసుకునే వారిని ఉపేక్షించేది లేదని సిద్ధిపేట కలెక్టర్ హైమావతి అన్నారు. సోమవారం మద్దూరు మండలంలో ఆకస్మికంగా పర్యటించిన కలెక్టర్ మండల పరిధిలోని లధ్నూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పిహెచ్సి లో మెడికల్ ఆఫీసర్ సెలవులో ఉన్నట్లు సిబ్బంది తెలుపగా సెలవుపై వివరాలను జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి తెలుసుకున్న కలెక్టర్ పిహెచ్సి లో అపరిశుభ్రత పైన అటెండర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు