భూ భారతి కుంభకోణం కేసులో 15 మంది అరెస్ట్
వరంగల్, 16 జనవరి (హి.స.) భూ భారతి కుంభకోణం కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనగామ, యాదాద్రి జిల్లాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్ప
భూభారతి


వరంగల్, 16 జనవరి (హి.స.)

భూ భారతి కుంభకోణం కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనగామ, యాదాద్రి జిల్లాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. బసవరాజు, జెల్లాను ప్రధాన నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి వీరు గండికొట్టినట్లు చెప్పారు. భూ భారతి వెబ్సైట్ సాంకేతిక లోపాలను ఆధారంగా చేసుకుని అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande