
తెలంగాణ, 16 జనవరి (హి.స.) మేడారం మహా జాతర ప్రారంభానికి ముందే భక్తులు పోటెత్తారు. మేడారం పరిసరాలన్నీ శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి. సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి భారీ క్యూలైన్ ఏర్పడింది. పస్ర-మేడారం, జాకారం-మేడారం మధ్య వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ములుగు గట్టమ్మతల్లి ఆలయం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు.. ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాతో తెలంగాణ ప్రభుత్వం రూ. 150 కోట్లకు పైగా నిధులతో ఏర్పాట్లు చేసింది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూలైన్లను వెడల్పు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు