
హైదరాబాద్, 16 జనవరి (హి.స.)
మెట్రో రెండో దశ పనులకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రెండో దశ నిర్మాణం గురించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో చర్చించినట్టు తెలిపారు. మెట్రో మొదటి దశ లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్టుగా ముందుగా మొదటి దశను టేకోవర్ చేసుకోవాలని చెప్పినట్టు తెలిపారు.
మొదటి దశను ఎల్ అండ్ టీ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, రెండో దశకు సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున కమిటీ వేయాలని మనోహర్ లాల్ ఖట్టర్ ఇప్పటికే మీతో చెప్పినట్టు తెలిపారన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు