
తిరుమల, 02 జనవరి (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల (Tirumala) భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవుల ప్రభావం, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఏడు కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో, టోకెన్లు లేని ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
ఇక ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లోకి ప్రవేశించే భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక టోకెన్ తీసుకున్న భక్తులకు 3 నుండి 5 గంటల వ్యవధిలో దర్శనం పూర్తి అవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV