
నంద్యాల, 02 జనవరి (హి.స.)ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరిగిపోతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సు అడ్డంపడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం వేగ ట్రావెల్స్ కు చెందిన బస్సు నెల్లూరు నుంచి కర్నూలు వైపు ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలో నంద్యాలలోని (Nandyal) చాబోలు సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఒక్కసారిగా అదుపు తప్పి అడ్డంపడింది. దీంతో బస్సు అద్దాలు పగలిపోయాయి. ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
ఈ ఆకస్మిక ఘటనతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ ఆరుగురు ప్రయాణికులు గాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం గాయపడినవారికి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV