
అమరావతి, 22 జనవరి (హి.స.)
-: చెన్నై-కోల్‌కతా హైవేలో ప్రకాశం జిల్లా ముప్పవరం నుంచి గుంటూరు జిల్లాలోని కాజ వరకు 100 కి.మీ. మేర యాక్సెస్ కంట్రోల్ కారిడార్‌గా మార్చే ప్రాజెక్ట్‌లో ముందడుగు పడింది. దీనికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) తయారీకి టెండర్లు పిలవగా, భోపాల్‌కు చెందిన ఎల్.ఎన్.మాలవ్య సంస్థ బిడ్ దక్కించుకుంది. డీపీఆర్ ఏడాదిలో సిద్ధం కానుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని కోడూరు నుంచి ప్రకాశం జిల్లాలో ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే (బెంగళూరు-అమరావతి హైవే)లోని వాహనాలు.. ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా హైవే (ఎన్‌హెచ్-16)లో చేరతాయి. వీటితోపాటు, అటు చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా కలిపి మున్ముందు.. ముప్పవరం నుంచి గుంటూరు, విజయవాడ వైపు రద్దీ పెరగనుంది. దీంతో సాఫీగా ప్రయాణం సాగేందుకు వీలుగా ముప్పవరం నుంచి కాజ దాటిన తర్వాత విజయవాడ బైపాస్ వరకు ఇప్పుడున్న హైవేని యాక్సెస్ కంట్రోల్‌గా కారిడార్‌గా మార్చాలని నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ