
అమరావతి, 10 మార్చి (హి.స.)
:జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మార్పులు చేపట్టినట్లు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగాలనుకున్న రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎండల తీవ్రత వల్ల పిఠాపురం ఆవిర్భావ సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ఈసారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా, నగరం, మండల కేంద్రం, పంచాయతీల్లో ఘనంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ