
అమరావతి, 10 మార్చి (హి.స.)
సచివాలయంలో 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జీవోఎంల నిర్ణయాలు, సచివాలయం, హెచ్ఓడీ భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఈపీసీ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయడంపై సమీక్ష జరిగింది. అలాగే రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై కూడా వివరంగా చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ