
అమరావతి, 10 మార్చి (హి.స.)
,విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీల సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఈ రోజు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. విజయవాడ సిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో తాము ఆకస్మిక తనిఖీ చేశామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ