ఏడాదిన్నర తర్వాత ప్రారంభించనున్నట్లు మాజీ. ముఖ్యమంత్రి జగన్.ప్రకటన
అమరావతి, 22 జనవరి (హి.స.) : ఏడాదిన్నర కాలం తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రకటించారు. ‘ఫిబ్రవరిలోనో, ఆ పై నెలలోనో ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఇక ప్రభుత్వానికి మిగిలింది మూడేళ్లు. అందులో ఒకటి
ఏడాదిన్నర తర్వాత ప్రారంభించనున్నట్లు మాజీ. ముఖ్యమంత్రి జగన్.ప్రకటన


అమరావతి, 22 జనవరి (హి.స.)

: ఏడాదిన్నర కాలం తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రకటించారు. ‘ఫిబ్రవరిలోనో, ఆ పై నెలలోనో ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఇక ప్రభుత్వానికి మిగిలింది మూడేళ్లు. అందులో ఒకటిన్నర సంవత్సరం తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. అక్కడ నుంచి ఒకటిన్నర సంవత్సరం రోడ్ల మీదే ప్రజలతో మమేమకవుతూ నా ప్రయాణం కొనసాగుతుంది’ అని వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో బుధవారం క్యాంపు కార్యాలయంలో సమావేశమైనప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande