నేడు కోటప్పకొండకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే
పల్నాడు, 22 జనవరి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. ఇవాళ పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. ఈ మేరకు స్పెషల్ హెలికాప్టర్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప
పవన్ కళ్యాణ్


పల్నాడు, 22 జనవరి (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. ఇవాళ పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారు. ఈ మేరకు స్పెషల్ హెలికాప్టర్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండకు చేరుకుంటారు. ఇవాళ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా కోటప్పకొండకు చెందిన త్రి కోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.

ఈ పర్యటన సందర్భంగా కొన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ సంద‌ర్శిస్తారు. అనంతరం కోటప్పకొండ - కొత్తపాలెం మధ్య నిర్మించిన 3.9 కోట్ల రోడ్డును ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మహాశివరాత్రి ఉత్సవాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ గా రివ్యూ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉత్సవాలపై ఎలాంటి ఏర్పాట్లు చేయాలి.. భద్రత ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే దాని పైన చర్చించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande