ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం.. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి
న్యూఢిల్లీ, 27 జనవరి (హి.స.) రేపటి (జనవరి 28) నుంచి పార్లమెంట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో రాజ్యసభా పక్ష నేత జేపీ నడ్డా, పార్లమె
ఢిల్లీ మీటింగ్


న్యూఢిల్లీ, 27 జనవరి (హి.స.)

రేపటి (జనవరి 28) నుంచి పార్లమెంట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో రాజ్యసభా పక్ష నేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో జరిగే మొదటి పార్లమెంట్ సమావేశాలు కావడంతో, సభసజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ పార్టీల నేతలు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం నోట్ చేసుకుందని, నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande