
న్యూఢిల్లీ, 27 జనవరి (హి.స.)
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో సామాన్య భక్తుల ప్రవేశంపై గత కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. ఈ క్రమంలో దర్పణ్ అవస్థి అనే వ్యక్తి మహాకాళేశ్వర ఆలయంలో సామాన్య భక్తులు- విఐపిల (VIP) మధ్య వివక్ష లేకుండా అందరికీ సమానంగా గర్భాలయ దర్శనం, పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ వేశారు. కాగా దీనిని మంగళవారం కోర్టు కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా పిటిషనర్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పిటిషన్లు వేసేవారు నిజమైన భక్తులు (శ్రద్ధాళువులు) కాదని, వారు వేరే ఉద్దేశాలతో కోర్టులను ఆశ్రయిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆలయాల్లో దర్శన వేళలు, నిబంధనలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం కోర్టుల పని కాదని స్పష్టం చేసింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..