మేక్ ఇన్ ఇండియాలో మరో కీలక మైలురాయిని చేరుకున్న పౌర విమానయాన రంగం
న్యూఢిల్లీ, 27 జనవరి (హి.స.) మేక్ ఇన్ ఇండియాలో పౌర విమానయాన రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. విమానాల తయారీకి అదానీ-ఎంప్రేయర్ కలిసి ఒప్పందం చేసుకున్నాయి. దేశీయంగా విమానాల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్, బ్రెజిల్క
మేక్ ఇన్ ఇండియా


న్యూఢిల్లీ, 27 జనవరి (హి.స.)

మేక్ ఇన్ ఇండియాలో పౌర విమానయాన రంగం మరో

కీలక మైలురాయిని చేరుకుంది. విమానాల తయారీకి అదానీ-ఎంప్రేయర్ కలిసి ఒప్పందం చేసుకున్నాయి. దేశీయంగా విమానాల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్, బ్రెజిల్కు చెందిన ప్రపంచ స్థాయి విమాన తయారీ సంస్థ 'ఎంప్రేయర్' మంగళవారం (జనవరి 27) ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సమక్షంలో న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో, భారతదేశంలో సమగ్ర 'రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ (RTA)' ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయనున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆత్మనిర్బర్ భారత్' - 'ఉడాన్' (UDAN) పథకాలకు మద్దతుగా ఈ ప్రాజెక్ట్ సాగనుంది. తద్వారా టైర్-2, టైర్-3 నగరాల మధ్య విమాన అనుసంధానం మెరుగుపడటమే కాకుండా, విదేశాల నుండి విమానాల దిగుమతిపై ఆధారపడటం తగ్గుతుంది.

కేవలం విమానాల తయారీకే పరిమితం కాకుండా, విమానాల నిర్వహణ (MRO), విడిభాగాల ఉత్పత్తి, పైలట్ శిక్షణ వంటి రంగాల్లోనూ ఈ రెండు సంస్థలు పనిచేయనున్నాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల విమానయాన రంగంలో వేలాది మందికి ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎంప్రేయర్ సంస్థకు ఇప్పటికే భారతదేశంలో మంచి పట్టు ఉంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande