బంగాళాఖాతంపై ‘నోటమ్‌’ జారీ.. క్షిపణి పరీక్షల కోసమేనా?
ఢిల్లీ,31,జనవరి (హి.స.)బంగాళాఖాతంపై భారత్‌ నోటమ్‌ (NOTAM) జారీ చేసింది. ఫిబ్రవరి 5-6 తేదీల్లో బంగాళాఖాతంపై 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాలను అనుమతించబోమంటూ ఎయిర్‌లైన్లకు నోటీసులు (నోటమ్‌) ఇచ్చింది. గతంలో 2,530 కిలోమీటర్లు ఉన్న నోటమ్ పరిమితిని సుమా
BrahMos Missile


ఢిల్లీ,31,జనవరి (హి.స.)బంగాళాఖాతంపై భారత్‌ నోటమ్‌ (NOTAM) జారీ చేసింది. ఫిబ్రవరి 5-6 తేదీల్లో బంగాళాఖాతంపై 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాలను అనుమతించబోమంటూ ఎయిర్‌లైన్లకు నోటీసులు (నోటమ్‌) ఇచ్చింది. గతంలో 2,530 కిలోమీటర్లు ఉన్న నోటమ్ పరిమితిని సుమారు 3,190 కిలోమీటర్లకు పెంచినట్లు తెలుస్తోంది.

క్షిపణి పరీక్షల కోసం భారత్‌ ఈ నోటీసులు జారీ చేసినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సముద్ర ఆధారిత క్షిపణి పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాతం గగనతలంలో ఎటువంటి పౌర విమానాలు ఎగరడానికి అనుమతి ఉండదని తెలిపాయి. అయితే క్షిపణుల ప్రయోగంపై భారత ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత పెద్ద మొత్తంలో ఆయుధాలను సమకూర్చుకుంటున్న భారత్‌.. స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేసింది. ఇందులోభాగంగా పలు క్షిపణి పరీక్షలను చురుకుగా నిర్వహిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande