బెంగాల్ ప్రభుత్వం 'అభివృద్ధి వ్యతిరేకి'..కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ, 03 ఫిబ్రవరి (హి.స.) మమతా బెనర్జీ ప్రభుత్వం పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ''అభివృద్ధి వ్యతిరేక'' ప్రభుత్వం గా మారిందని ఆయన విమర్శించారు. రైల్వే ప్రాజెక్టులు, మరేదైనా ప్రధాన
Ashwini Vaishnav


న్యూఢిల్లీ, 03 ఫిబ్రవరి (హి.స.)

మమతా బెనర్జీ ప్రభుత్వం పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం 'అభివృద్ధి వ్యతిరేక' ప్రభుత్వం గా మారిందని ఆయన విమర్శించారు. రైల్వే ప్రాజెక్టులు, మరేదైనా ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం సరైన కారణం లేకుండానే అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.

అలాగే కోల్కతా మెట్రో ప్రాజెక్టు ను ఉదాహరణగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును మంత్రి ఎండగట్టారు. కోల్కతా మెట్రో (Kolkata Metro) ప్రారంభమైన మొదటి 40 ఏళ్లలో కేవలం 25 కిలోమీటర్ల నెట్వర్క్ మాత్రమే పూర్తయిందని గుర్తు చేశారు. అలాగే గత 11 ఏళ్లలోనే ఏకంగా 45 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. కేంద్రం సహాయంతో ఎంతో పురోగతి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత కీలకమైన చింగ్రిఘాట (Chingrighata) వద్ద పనులు గత రెండేళ్లుగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. మెట్రో ప్రాజెక్టు పూర్తి కాకూడదనే ఉద్దేశంతోనే పనులకు అనుమతులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande