
పోలవరం, 07 జనవరి (హి.స.)పనుల పురోగతిపై పరిశీలనతూర్పుగోదావరి జిల్లా పోలవరంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు..
: తూర్పుగోదావరి జిల్లా పోలవరం(Polavaram)లో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) పర్యటిస్తున్నారు. ఏరియల్ విజిట్ ద్వారా ప్రాజెక్టు పురోగతి పనులపై ఆయన విజిట్ చేశారు. వ్యూ పాయింట్ నుంచి స్పిల్ వే సహా మొత్తం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ పనులనూ సీఎం చంద్రబాబు పరిశీలించారు.
సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం
అంతకుముందు పోలవరం హెలిపాడ్ వద్దకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV