జీఎస్టీ ఎగవేత.. కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్
హైదరాబాద్, 07 జనవరి (హి.స.) జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ, తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. బుధవారం ఉదయం అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు రూ.28 కోట్ల పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ ఇంటెలి
కాంగ్రెస్ నేత


హైదరాబాద్, 07 జనవరి (హి.స.)

జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ, తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. బుధవారం ఉదయం అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు రూ.28 కోట్ల పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తునట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీల్ కుమార్ పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande