
విశాఖపట్నం, 07 జనవరి (హి.స.) 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్(Additional District) కోర్టుకు మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) హాజరయ్యారు. ఓ ప్రత్రికపై ఆయన గతంలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ధర్మాసనం పలుమార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మరోసారి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఇవాళ ఆయన రావాలని సూచించింది. దీంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు.
‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ శీర్షికతో 2019, అక్టోబర్ 22న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) అనుకూల పత్రిక అసత్య కథనం రాసిందని లోకేశ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. మూడోసారి జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్‌కు లాయర్లతో కలిసి లోకేశ్ కోర్టుకు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV