
తిరుమల, 07 జనవరి (హి.స.)రేపటితో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. ఇక ఎల్లుండి నుంచి ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాల పునరుద్ధరణ జరుగుతుంది. ఇక అటు భక్తుల సౌకర్యం, పరిపాలన అవసరాల దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ భారీ మార్పులు కూడా చేసింది.
:తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. వైకుంఠ ద్వార దర్శనాలపై కీలక అప్డేట్ వచ్చింది. రేపటితో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. ఇక ఎల్లుండి నుంచి ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాల పునరుద్ధరణ జరుగుతుంది. ఇక అటు భక్తుల సౌకర్యం, పరిపాలన అవసరాల దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ భారీ మార్పులు కూడా చేసింది.
ఇకపై ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదలై, మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులో ఉండనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలకమండలి. డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా, రేపటితో ముగియనున్నాయి. అటు ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ, ఈ నెల 10వ తే నుంచి వరుసగా సెలవులు ఉన్న తరుణంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే ఛాన్సులు ఉన్నట్లు టీటీడీ అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చకచకా చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV