
అమరావతి, 01 అక్టోబర్ (హి.స.)
బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు సీనియర్ న్యాయనిపుణులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
వచ్చే సోమవారంలోపు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈలోపు బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ