
హైదరాబాద్, 01 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ పల్లెల్లో నేటి నుండి చిన్న బతుకమ్మ గా పిలుచుకునే బొడ్డెమ్మ పండుగ సంబరాలు మొదలయినాయి.
రాష్ట్రంలో వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన
బొడ్డెమ్మ వేడుకలు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో మహాలయ బహుళ పంచమి గురువారం పెత్తర అమావాస్యకు ముందు ప్రారంభమవుతాయి. బొడ్డెమ్మ ఆటలతో గ్రామాల్లో కన్నె పిల్లల సంబరాలు ప్రారంభమయ్యాయి. బొడ్డెమ్మల సందడితో గ్రామాల్లో సందడి కనువిందు చేస్తుంది. గౌరీదేవి రూపంగా పూజించే బొడ్డెమ్మను తీరొక్క పూలతో పూజించి తొమ్మిది రోజుల తర్వాత చెరువులు, బావుల్లో నిమజ్జనం చేస్తారు. గ్రామాల్లో దేవాలయం ప్రాంగణంలో ప్రధాన కూడళ్ల వద్ద అలంకరించిన బొడ్డెమ్మను పెట్టి, కన్నె పిల్లలు, మహిళలు బొడ్డెమ్మ చుట్టూ చేరి తిరుగుతూ, పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ అలంకరించిన బొడ్డెమ్మను తొమ్మిది రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకొని చివరి రోజు చెరువులో లేదా బావుల్లో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం తర్వాత వచ్చే అమావాస్య నుండి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కావడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు