తెలంగాణలో భానుడి భగభగలు.. 35 డిగ్రీల ఉష్ణోగ్రత
తుఫాన్ ప్రభావం తగ్గడం లాంటి కారణాలతో తెలంగాణలో భానుడి భగభగలు మొదలయ్యాయి.
Temperature


హైదరాబాద్, 01 అక్టోబర్ (హి.స.)

నైరుతి రుతుపవనాల తిరోగమనం మరియు తుఫాన్ ప్రభావం తగ్గడం లాంటి కారణాలతో తెలంగాణలో భానుడి భగభగలు మొదలయ్యాయి.దీంతో రాష్ట్రం అంతటా సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నవి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి అధికంగా నమోదవుతున్నాయి. నిన్న అనగా బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34.2డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 22.6డిగ్రీలు, గాలిలో తేమ 57శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందని వారు పేర్కొన్నారు. మండుతున్న ఎండలతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం టాప్ రేంజ్ కి చేరుకుంది. గాలిలో అధిక తేమ వల్ల జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande