నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై కఠిన చర్యలు
నిబంధనలు అధిక్రమిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ ఆర్టిఏ అధికారులు చెబుతున్నారు.
Rta


హైదరాబాద్, 01 అక్టోబర్ (హి.స.)

నిబంధనలు అధిక్రమిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ ఆర్టిఏ అధికారులు చెబుతున్నారు.

వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్పై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దును ప్రయోగిస్తున్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై, ట్రాఫిక్, రవాణా నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన 9 నెలల్లో 1260 లైసెన్స్ రద్దునకు ఆర్టీఏకు సిఫారసులు వచ్చాయి. అందులో 270 లైసెన్స్లను అధికారులు రద్దు చేశారు. తొలుత జరిమానాలతో సరిపెడుతూనే, పదేపదే నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేస్తున్నారు. లైసెన్స్ సస్పెండ్ చేసేందుకు రెండు కేటగిరులుగా విభజించారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులు మొదటి క్యాటగిరిగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్న వాటిని రెండో క్యాటగిరిగా వర్గీకరించి కేసులు నమోదు చేస్తున్నారు. వీటితో పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేసే ప్రక్రియపై కూడా కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు లైసెన్స్ రద్దులో ఉన్నప్పుడు వాహనం నడుపుతూ దొరికితే జైలు శిక్ష కూడా పడే వీలుందని అధికారులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande