
హైదరాబాద్ , 01 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్లో ఆన్లైన్ కిరాణా, క్విక్-కామర్స్ సేవలకు సంబంధించిన నాలుగు డార్క్ స్టోర్లపై ఆహార భద్రత అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. TG SAFE ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో నాలుగు స్టోర్ల FSSAI లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
స్విగ్గీ ఇన్స్టామార్ట్కు చెందిన పెట్ బషీరాబాద్, సైదాబాద్ కేంద్రాలు, ఫ్లిప్కార్ట్కు చెందిన చార్మినార్లోని పంజేషా రోడ్ కేంద్రం, జెప్టోకు చెందిన రామ్కోటి కేంద్రంపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తనిఖీల్లో పరిశుభ్రత లోపాలు, దుమ్ము పట్టిన మరియు తుప్పుపట్టిన ర్యాకులు, సాలెగూళ్లు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, దెబ్బతిన్న ఉత్పత్తులు, సరిగా నిల్వ చేయని వస్తువులు, ఫంగస్ సోకిన కూరగాయలు, బొద్దింకలు, ఇతర పురుగుల సమస్యలు గుర్తించినట్లు TG SAFE పేర్కొంది. మొత్తం 16 డార్క్ స్టోర్లను పది ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీ చేశాయి. 15 ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. మరో ఐదు కేంద్రాలకు షోకాజ్ నోటీసులు, మూడు కేంద్రాలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. క్విక్-కామర్స్ వినియోగం వేగంగా పెరుగుతున్న సమయంలో ఆహార పదార్థాల నిల్వ, ఉష్ణోగ్రత నియంత్రణ, గడువు తేదీలు, పరిశుభ్రత వంటి అంశాల్లో నిర్లక్ష్యం జరిగితే వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ తనిఖీలను అధికారులు వినియోగదారుల భద్రతకు సంబంధించిన చర్యగా వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్