రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి, 01 అక్టోబర్ (హి.స.)ఒకప్పుడు కరువుకు చిరునామాగా భావించిన రాయలసీమను దేశానికే కాకుండా ప్రపంచానికే ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక ర
అచ్చెన్నాయుడు


అమరావతి, 01 అక్టోబర్ (హి.స.)ఒకప్పుడు కరువుకు చిరునామాగా భావించిన రాయలసీమను దేశానికే కాకుండా ప్రపంచానికే ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.

‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ కార్యక్రమానికి సమగ్ర కార్యాచరణ రూపొందించిందని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రూ.లక్ష కోట్లతో చేపట్టే ఈ కార్యక్రమంలో 10 జిల్లాల్లో 201 ఉద్యాన క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. 2026 ఆగస్టు నుంచి 2029 జూలై వరకూ మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.

రూ.1 లక్ష కోట్లతో సమగ్ర ప్రణాళిక

రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళికలో సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించామని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందులో ప్రభుత్వ రంగంలో రూ.40,352 కోట్లు, ప్రైవేటు రంగం నుంచి సుమారు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు సమీకరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడుల్లో సాగునీటి రంగానికి రూ.20,884 కోట్లు, ఉద్యానవన రంగానికి రూ.14,906 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.4,562 కోట్లు ప్రతిపాదించినట్లు వివరించారు. 2026 ఆగస్టు నుంచి 2029 జూలై వరకు మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేసి, 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉద్యాన విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం, ఉత్పత్తిని దాదాపు రెట్టింపు చేయడం, సుమారు 9.6 లక్షల రైతుల ఆదాయం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యం అని వ్యవసాయ, ఉద్యానవన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande