
తిరుమల, 01 అక్టోబర్ (హి.స.)తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24గంటల సమయం పడుతోంది.
ఎలాంటి ముందస్తు టోకెన్లు లేకుండా స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం టోకెన్లు లేని సర్వదర్శనానికి భక్తులు ఏకంగా 24 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, భక్తుల క్యూలైన్ ఆక్టోపస్ భవనం వరకు కొనసాగుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న శ్రీవారిని 78,723 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 37,664 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.63 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV