
మెదక్, 17 అక్టోబర్ (హి.స.) దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని బిజెపి ఎంపీ రఘునాథన్ రావు అన్నారు.
పేద ప్రజలకు, దివ్యాంగులకు అండగా నరేంద్ర మోదీ సర్కార్ పనిచేస్తుందని ఎంపీ తెలిపారు.
శనివారం వారు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమం లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారితో కలిసి హాజరై దివ్యాంగులకు పరికరాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునoదన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కాస్కో క్రీడా పోటీల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు 49 పతకాలు సాధించి దేశాన్ని నాలుగో స్థానంలో నిలిపారని గుర్తు చేశారు.
దివ్యాంగులను గుర్తించేందుకు ప్రాజెక్టు పరిధిలో కాకుండా మండల స్థాయిలోనే క్యాంపులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు