జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ లో కొలువైన బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నవి.
Collector


జోగులాంబ గద్వాల, 17 అక్టోబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ లో కొలువైన బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నవి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహిస్తున్న సామూహిక చండీ హోమం లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వేదమంత్రాల నడుమ నిర్వహిస్తున్న హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు.

ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుండటంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి ఐఏఎస్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను సమర్పించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande