విద్యుత్ సమస్యల నుండి రైతులకు ఉపశమనం.. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
నల్గొండ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని మూసాపేట మండలం జానంపేట గ్రామ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శనివారం నిర్వహించిన ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ట్రాన్స్ ఫార్మర్లను అందజేశారు.
MLA

నల్గొండ, 17 అక్టోబర్ (హి.స.)

నల్గొండ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని మూసాపేట మండలం జానంపేట గ్రామ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శనివారం నిర్వహించిన ట్రాన్స్ఫార్మర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు ట్రాన్స్ ఫార్మర్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు లో వోల్టేజీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో , లో వోల్టేజీ సమస్యలతో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశానని గుర్తు చేశారు.

తక్కువ వోల్టేజీ కారణంగా పంటలు ఎండిపోతుండటంతో సమస్య పరిష్కారం కోసం అప్పట్లో ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. రైతులకు లో వోల్టేజీ సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటివరకు 2 వేలకుపైగా ట్రాన్స్ ఫార్మర్లను అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. దీంతో రైతులకు విద్యుత్ సమస్యల నుంచి ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande