
హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
శనివారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సర్వే పురోగతిపై నిర్వహించిన సుదీర్ఘంగా సమీక్షించా ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
భూ సర్వేలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా భూ సమస్యలు లేని తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలకు గాను తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసి, నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు