
హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.)
కుతుబుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొంపల్లి సర్కిల్ లో నేడు ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీలోని తక్కువ ఒత్తిడితో తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ తదితర సమస్యలను కాలనీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యలను విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి, వీధి దీపాల నిర్వహణతో పాటు పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కాలనీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతుల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు