
కరీంనగర్, 17 అక్టోబర్ (హి.స.)
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని సైదాపూర్ మండలం సోమారం గ్రామ శివారులో వ్యవసాయ బావి తవ్వకం పనులు జరుగుతున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
ఈ దాడిలో వారు భారీ ఎత్తున జిలెటిన్ స్టిక్స్, డిటోనేటింగ్ వైర్తో పాటు రెండు కంప్రెసర్ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వాడుతున్నట్లు సమాచారం అందడంతో ఏసీపీ సతీష్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.
ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమతులూ లేని 475 జిలెటిన్ స్టిక్స్, సుమారు 3000 మీటర్ల పొడవైన డిటోనేటింగ్ వైర్ (3 బండిళ్లు) తో పాటు, బావి తవ్వకానికి ఉపయోగిస్తున్న రెండు కంప్రెసర్ ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు