
హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)
ఒకవైపు దేశవ్యాప్తంగా కరువు సూచనలు కనపడుతున్న నేపథ్యంలో ఆదివారం ఘట్కేసర్ పరిధిలోని ముస్లింలు వర్షాలు కురియాలంటూ చేసిన ప్రార్థనలు విశేషంగా మారాయి.
వరుణుడు కరుణించి విస్తారంగా
వర్షాలు కురిసి కరువు నుంచి కాపాడాలని ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ డివిజన్ మర్పల్లిగూడలో ఆదివారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మర్పల్లిగూడా మస్జిద్ -ఏ- బిలాల్ ఆవరణలో ముస్లింలు సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నీటితో నిండాలని, రైతులకు మేలు జరగాలని, పర్యావరణ భూతాపం తగ్గాలని, తాగు, సాగు నీటి కొరత ఏర్పడకుండా ఉండాలని, జీవరాశులన్నిటికీ మంచి నీరు అందాలని, పర్యావరణ హాని కలగకుండా చూడాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు