డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణo ప్రతి ఒక్కరి బాధ్యత.. రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణo ప్రతి ఒక్కరి బాధ్యత.. రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్
Dr Laxman


హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అక్షర స్ఫూర్తి చైర్మన్ డా. కె. లక్ష్మణ్ నేతృత్వంలో సికింద్రాబాద్లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న అనంతరం డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం యువత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వం, కుటుంబాలు, పాఠశాలలు, సామాజిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. చిన్నారుల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. వారి స్నేహాలు, అలవాట్లు, రోజువారీ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande