రక్తదానం ప్రాణదానంతో సమానం.. ఏసీపీ మాధవి
హుజురాబాద్ పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
Acp


హుజురాబాద్, 27 అక్టోబర్ (హి.స.)

హుజురాబాద్ పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ఆపదలో ఉన్నవారికి రక్తదానం ద్వారా ప్రాణదానం చేయవచ్చని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ.. రక్తదానం ఎంతో విలువైన సేవ అని, అత్యవసర సమయాల్లో రక్తం అందించి పలువురి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.

ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

ప్రజలు సమాజంలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించేందుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు పేర్కొన్నారు.

ప్రజల భద్రత కోసం పోలీసులు విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ త్యాగం చేస్తున్నారని కొనియాడారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande