అక్రమ మైనింగ్ కేసులో పొదలకూరు మాజీ ఉపసర్పంచ్కు పోలీసుల నోటీసులు
నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పొదలకూరు మాజీ ఉపసర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Legal notice


నెల్లూరు , 31 అక్టోబర్ (హి.స.)

నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పొదలకూరు మాజీ ఉపసర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసులో ఆయనను ఏ2 నిందితుడిగా పేర్కొంటూ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం మైన్ వద్ద అక్రమంగా మైనింగ్ నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన అక్రమాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తుల పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో కేసులో ఏ2గా ఉన్న వాకాటి శ్రీనివాసులరెడ్డికి తాజాగా నోటీసులు అందజేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. విచారణ సమయంలో అక్రమ మైనింగ్కు సంబంధించిన వివరాలు, ఇతర నిందితులతో ఉన్న సంబంధాలు తదితర అంశాలపై పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande