బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసరాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
karnataka-weather-update-bengaluru-cloudy-rain-coastal-districts


అమరావతి , 31 అక్టోబర్ (హి.స.)

ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర పరిసరాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. రానున్న గంటల్లో ఇది మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. దీంతో తుపాను ముప్పు పొంచి ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత తీవ్ర అల్పపీడనం వచ్చే ఆరు గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో అదే ప్రాంతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని అంచనా వేస్తున్నారు. అనంతరం మరో 24 గంటల్లో మరింత బలాన్ని పుంజుకుని తుపానుగా మారే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు.

తుపాను ఏర్పడితే దాని ప్రభావం రాష్ట్ర తీర ప్రాంతాలపై పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఎల్లుండి సాయంత్రానికి ఇది రాష్ట్ర తీరానికి సమీపంలోకి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు వాతావరణ పరిస్థితులను గమనించాలని, అధికారుల సూచనలు పాటించాలని చెబుతున్నారు. అల్పపీడనం కదలికలు, తీవ్రతను వాతావరణ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. రానున్న రోజుల్లో తుపాను దిశ, ప్రభావంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande