యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సేవలో గవర్నర్ దంపతులు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Governor


హైదరాబాద్, 31 అక్టోబర్ (హి.స.)

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువైయున్న ప్రసిద్ధ వైష్ణవాలయమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు గవర్నర్ దంపతులకు

కొండపై ఉన్న అతిథి గృహం వద్ద రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవస్థానం ఈవో భవానీ శంకర్, కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, దేవస్థానం బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం దేవస్థానం రూపొందించిన 2027 నూతన వార్షిక క్యాలెండర్ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande