మహిళను వేధించిన ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల ఆందోళన
సిద్దిపేట జిల్లాలో మహిళను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
Harassment


హైదరాబాద్ , 31 అక్టోబర్ (హి.స.)

సిద్దిపేట జిల్లాలో మహిళను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. లింగారెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటనకు నిరసనగా గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

వైద్యం చేయించుకునేందుకు తన వద్దకు వచ్చిన మహిళను ఆర్ఎంపీ వేధింపులకు గురిచేసినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఆమెకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించి, వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.

ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande