
హైదరాబాద్, 06 అక్టోబర్ (హి.స.)
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో కోనో కార్పస్ చెట్లను 4 వారాల్లోపు తొలగించాలని హైకోర్టు ధర్మాసనం అటవీ, సిద్దిపేట మున్సిపల్ అధికారులను ఆదేశించింది.
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో కోనూ కార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో ప్రజా ఆరోగ్య కరమైన చెట్లను నాటాలని గాదగోని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి అటవీ, మున్సిపల్, ఆరోగ్య శాఖ, జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు.
అయినప్పటికి సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చక్రధర్ గౌడ్ హైకోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత చక్రధర్ గౌడ్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు నాలుగు వారాల్లోపు సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని కోనో కార్పస్ చెట్లను వేర్లతో సహ తొలగించి వాటి స్థానంలో ప్రజాఉపయోగకర చెట్లను నాటాలని ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు