
ఖమ్మం, 06 అక్టోబర్ (హి.స.)
జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కామేపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ దివాకర టి. పరిశీలించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పోషకాహార పదార్థాలను పరిశీలించి, వాటి వినియోగం, పోషక విలువలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్య ఆహారం తీసుకోవడం, స్థానికంగా లభించే చిరుధాన్యాలు, ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు